ఎమ్మెల్సీ బరి.. హోరాహోరీ
ఏలూరు జిల్లా
పోలింగ్ కేంద్రాలు 20 ఓటర్లు 2,605
పశ్చిమగోదావరి జిల్లా
పోలింగ్ కేంద్రాలు 20 ఓటర్లు 3,662
5 జిల్లాల్లో 16,316 మంది ఓటర్లు
సోమవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2024
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్లు, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన క్రమంలో అభ్యర్థులు హోరాహోరీ ప్రచారానికి తెరతీశారు. ఉపాధ్యాయ సంఘాల వారీగా మద్దతు కూడగట్టుకోవడంతో మొదలుపెట్టి వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. హ్యా ట్రిక్ విజయం కోసం యూటీఎఫ్ బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి బరిలో ఉండగా కీలక ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గంధం నారాయణ పోటీల్లో కీలకంగా ఉన్నారు. ఇక మరో ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పలు సంఘాల మద్దతుతో పోటీలో ఉన్నారు.
కొనసాగుతున్న హడావుడి
ఉభయగోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ హడావుడి కొనసాగుతోంది. ఉభయగోదావరి జిల్లాలోని ఐదు జిల్లాల పరిధి (ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ)లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 11న నోటిఫికేషన్ జారీ అయిన క్రమంలో 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న స్క్రూట్నీ ప్రక్రియ, 21న ఉపసంహరణలు పూర్తయ్యాయి. ఉపసంహరణల అనంతరం పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా గోపిమూర్తి (భీమవరం), ఎస్‌టీయూతో పాటు మిగిలిన సంఘాలు బలపరిచిన గంధం నారాయణరావు (ద్రాక్షరామం), అలా గే నాయన వెంకటలక్ష్మి (సామర్లకోట), పి.దీపక్ (తాడేపల్లిగూడెం), కలవం నాగేశ్వరరావు (రాజ మండ్రి) బరిలో నిలిచారు.
సాబ్జీ మరణంతో ఎన్నికలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ 2023 డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వాస్తవానికి 2027 మార్చి 29 వరకు ఆయన పదవీ కాలం ఉండటంతో టీచర్ ఎమ్మెల్సీ అనివార్యమైంది. పీడీఎఫ్ అభ్యర్థిగా గోపిమూర్తికి యూటీఎఫ్, ఏపీటీఎఫ్–1938, జూనియర్, డిగ్రీ, కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్లు, ఆదివాసీ, బీటీఏ, గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు మద్దతు ఇస్తున్నారు. ఇక నారాయణరావుకు ప్రధానమైన ఎస్‌టీయూతో పాటు హెచ్‌ఎంల అసోసియేషన్, ఏపీటీఎఫ్, బీటీయూ, ఎస్‌ఎల్‌టీఏ, ఏపీఏఎస్‌లతో పాటు మరికొందరు మద్దతు ఇస్తున్నారు. దీంతో పోటీ వీరిద్దరి మధ్య హోరాహోరీగా ఉండనుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీతో ప్రచారపర్వం ముగించనున్నారు. ఇక ఏలూరు జిల్లాలో 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా 2,605 మంది ఓటర్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా 3,662 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
న్యూస్‌రీల్
విస్తృతంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం
పోటీలో ఐదుగురు అభ్యర్థులు
గోపిమూర్తి, నారాయణరావు మధ్యే ప్రధాన పోరు
ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగడుతున్న వైనం
ఉమ్మడి పశ్చిమగోదావరిలో 6,267 ఓట్లు
40 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
వచ్చేనెల 5న ఎన్నిక
ఉభయగోదావరి జిల్లాలోని 5 జిల్లాల పరిధిలో 16,316 మంది టీచర్లు ఓటు హక్కు నమోదుకు ఎన్‌రోల్ చేసుకున్నారు. వీరిలో 9,642 మంది పురుషులు, 6,674 మంది మహిళా ఓటర్లు ఉన్నా రు. మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ప్రామాణికంగా తీసుకుని ఏజెన్సీ ఏరియాలతో కలిపి మొత్తంగా 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 3,662 ఓట్లు ఉన్నాయి. వచ్చేనెల 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియను బ్యాలెట్ విధానంలో (ప్రాధాన్య క్రమం) నిర్వహించనున్నారు. కాకినాడ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండగా మిగిలిన జిల్లాల డీఆర్వోలు సహాయ రిట ర్నింగ్ అధికారులుగా ఎన్నికల విధుల్లో ఉన్నారు. వచ్చేనెల 9న కాకినాడలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈనెల 11 నుంచే ఎన్నికల కోడ్ అమలులో రావడంతో అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment