పెంచిన చార్జీలను ఉపసంహరించాలి | - | Sakshi
Sakshi News home page

పెంచిన చార్జీలను ఉపసంహరించాలి

Published Mon, Nov 25 2024 12:16 AM | Last Updated on Mon, Nov 25 2024 12:16 AM

పెంచిన చార్జీలను ఉపసంహరించాలి

పెంచిన చార్జీలను ఉపసంహరించాలి

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలని, స్మార్ట్‌ మీటర్లను ప్రజలు వ్యతిరేకించాలని వామపక్ష పార్టీల జిల్లా సదస్సులో నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు విద్యుత్‌ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారని దు య్యబట్టారు. అలాగే స్మార్ట్‌మీటర్లను బలవంతంగా బిగిస్తున్నారని, దీనిని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సీపీఎం నగర కార్యదర్శి పి.కిషోర్‌, సీపీఐ నగర కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌, సీపీఐ (ఎంఎల్‌) డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement