ఉత్సాహంగా సాక్షి స్పెల్–బి పరీక్షలు
తాడేపల్లిగూడెం అర్బన్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో సాక్షి స్పెల్–బి పరీ క్షలు ఉత్సాహంగా జరిగాయి. తాడేపల్లిగూడెంలోని సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఆదివారం స్పెల్–బి పరీక్షలు నిర్వహించారు. presenting స్పాన్సర్‌గా Dukes waffy, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) వ్యవహరిస్తున్నారు. స్పెల్–బి పరీక్షలకు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, గణపవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. తమ పిల్లలు స్పెల్–బిలో పాల్గొనేలా తల్లిదండ్రులు దగ్గరుండి పరీక్షకు తీసుకువచ్చారు. పరీక్షలను నాలుగు విభాగాలుగా నిర్వహించారు. ఒక్కో విభాగంలో 40 ఇంగ్లిష్ పదాల ను ఇన్విజిలేటర్ గా వ్యవహరించిన సెంట్ ఆన్స్ ఉపాధ్యాయుడు మైకులో వెల్లడిం చగా, అనంతరం డిజిటల్ స్క్రీన్ ద్వారా కంప్యూటర్ వాయిస్‌ను ఉపయోగించి ఇంగ్లిష్ పదాలను తెలియజేశారు. విద్యార్థులు ముందుగా ఇన్విజిలేటర్ చెప్పిన పదానికి, తర్వాత కంప్యూటర్ వాయిస్‌లో విన్న పదాలకు మధ్య ఉన్న వాయిస్ సౌండ్‌ను అనుసరించి పదాలకు స్పెల్లింగ్‌లు రాశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
నాలుగు విభాగాలుగా నిర్వహణ
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచితరలివచ్చిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment