ప్రాక్టీస్ చేశాను
సాక్షి స్పెల్–బి పరీక్షకు హాజరయ్యేందుకు మా స్కూల్‌లో ఇంగ్లిష్ పదాలను చదివించి ప్రాక్టీస్ చేయించారు. పరీక్ష బాగా రాశాను. భవిష్యత్తులో ఇంగ్లిష్‌ను మరింత నైపుణ్యంగా నేర్చుకుంటాను.
– స్వర్నమూడి జోత్స్న, 7వ తరగతి, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం
సంతోషంగా ఉంది
సాక్షి స్పెల్–బి పరీక్ష రాయడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇంగ్లిష్ పదాలకు స్పెల్లింగ్ రాయడంతోపాటు పదాలను పలికే విధానంలో నైపుణ్యం పెంచుకోవాలని తెలిసింది. ఆ దిశగా ఇంగ్లిష్ ప్రాక్టీస్ చేస్తాను.
– దొమ్మేటి గౌతమ్, 4వ తరగతి, ఆదిత్య స్కూల్, వల్లూరు
శిక్షణ పొందాలి
సాక్షి స్పెల్–బిలో పాల్గొనేందుకు మంచి శిక్షణ పొందాల్సి ఉంది. ఒకసారి పరీక్షకు హాజరైతే ఎలా ఇంగ్లిష్‌పై నైపుణ్యం సాఽధించాలో తెలుస్తుంది. ఇప్పుడు స్పెల్–బి పరీక్షను బాగానే రాశాను. ఇంకా శిక్షణ పొందాలి.
– పెన్మత్స సాత్విక, 7వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం
నైపుణ్యం సాధించేలా..
సాక్షి స్పెల్–బి పరీక్షను రాయడం చాలా బాగుంది. మొదటిసారి రాయడంతో భవిష్యత్తులో ఇంగ్లిష్ పదాలకు స్పెల్లింగ్‌లపై నైపుణ్యం సాధించి పరీక్షకు హాజరుకావాలని తెలిసింది. ఇంగ్లిష్‌పై ఆసక్తి పెరిగింది.
– మాదేటి సూర్యనారాయణ, 6వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం
●
Comments
Please login to add a commentAdd a comment