ద్వారకాతిరుమల క్షేత్రానికి నూతన శోభ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రం కొత్త శో భను సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు, సినీ హీరోల ఫ్లెక్సీలతో దర్శనమిచ్చే గరుడాళ్వార్ సెంటర్ ఆలయ సమాచారాన్ని అందించే కేంద్రంలా మారింది. ఈనెల 15న ‘సాక్షి’లో ప్రచురించిన ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘనులు’ శీర్షికన కథనానికి మండల పరిషత్, పంచాయతీ అధికారులు స్పందించారు. స్థానిక గరుడాళ్వార్ సెంటర్ను ఆధ్యాత్మిక సమాచార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో శ్రీవారి క్షేత్ర ఉప, దత్తత ఆలయాల పూర్తి వివరాలు, పథకాల సమాచారంతో కూడిన బోర్డులను ఏ ర్పాటుచేశారు. రాత్రి వేళల్లో సైతం ఇవి కనిపించేలా (విద్యుత్ బోర్డులు) అమర్చారు. ఇవి ఆకట్టుకోవడంతో పాటు మంచి సమాచారాన్ని అందించేలా ఉన్నాయని భక్తులు అంటున్నారు. అలాగే శివాలయం ఆర్చిగేటును రంగులతో సుందరీకరించి, విద్యుత్ లైట్లను ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతం కొత్త కాంతులతో ధగధగలాడుతోంది. ఉగాది మండపం వద్ద (కొండపైకి వెళ్లే) ఆర్చిగేటు ముస్తాబవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment