ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి తగదు
కలెక్టర్ నాగరాణి
భీమవరం: ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్‌టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేయరాదని కళాశాలల యాజమాన్యాలను కలెక్టర్ చదలవాడ నా గరాణి ఆదేశించారు. జిల్లాలో డిగ్రీ, ఇంట ర్మీడియెట్ కళాశాలల యజమాన్యాలు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమ న్నారు. ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, పరీక్షలకు రానీయకపోవడం వంటివి జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కళాశాలలను బ్లాక్‌లిస్టులో పెడతామని, కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభు త్వం ఫీజును కళాశాలల అకౌంట్లలోకి జమ చేస్తామని జీఓ ఇచ్చిందని, కళాశాలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు.
కరస్పాండెంట్‌పై కేసు
ఆకివీడు: విద్యార్థినిని కొట్టిన ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై హనుమంతు నాగరాజు ఆదివారం చెప్పారు. స్థానిక విజ్ఞాన్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరస్పాండెంట్ ఎన్‌వీవీ సత్యనారాయణపై కేసు నమోదు చేశామన్నారు.
మనసు లేని వారే దివ్యాంగులు
తణుకు అర్బన్: సమాజ సేవ చేయని వారు, మనసు లేనివారే దివ్యాంగులని ఐఏఎస్ అకా డమీ అధినేత మల్లవరపు బాలలత అన్నారు. తణుకు కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం డాక్టర్ పీఎన్‌ఎస్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులపై సమాజం చూపుతున్న వివక్షను చూసి తట్టుకోలేకపోయానని, అందరికీ తాను స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో సివిల్స్ సాధించానన్నారు. ఏడాదికి ఒక్క దివ్యాంగుడినైనా ఐఏ ఎస్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. దివ్యాంగులమని ఎవరూ బాధపడవద్దని, మన విజయాన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందేలా ముందుకు సాగాలన్నారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఫౌండేషన్ అధ్యక్షుడు సతీష్‌కుమార్‌ను అభినందించారు. భీమవరం, తణుకు, రాజమండ్రి ఆస్పత్రుల నుంచి ప్రముఖ వైద్యులు హాజరై దివ్యాంగులకు ఉచిత వైద్య సేవలందించారు. కై కరానికి చెందిన వెంకటేశ్వర మెడికల్స్ యాజమాన్యం ఉచితంగా మందులు అందించారు. దివ్యాంగులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. పలు కంపెనీల ప్రతినిధులతో జాబ్‌మేళా నిర్వహించి దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు.
జిల్లా నలుమూలల నుంచి..
ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా నలుమూలల నుంచి దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమారు 5 వేల మందికి పైగా దివ్యాంగులు పాల్గొన్నారు.
చిన్న వెంకన్న సేవలో డీజీపీ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదివారం సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. డీజీపీ స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఈఓ మూ ర్తి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు.
ఘనంగా హనుమద్ కల్యాణం
జంగారెడ్డిగూడెం రూరల్: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో కార్తీక మా సోత్సవాల్లో భాగంగా ఆదివారం సువర్చలా హనుమద్ కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సోమవారం ఆలయంలో లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment