మద్యం దుకాణం ఏర్పాటుపై నిరసన
పాలకోడేరు: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో దళితపేటకు దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటుకు మరోసారి ప్రయత్నిస్తుండడంతో దళితులు ఆందోళనకు దిగారు. తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రార్ధన మందిరాలకు, శ్మశానాలకు దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటు దుర్మార్గమని అన్నారు. గతంలో చేసిన ఆందోళనకు దిగివచ్చి మద్యం దుకాణం వేరే చోటుకి తరలిస్తామని చెప్పి మళ్లీ ఇక్కడే ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం తమను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే చోటుకి తరలించేవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment