సౌత్ జోన్ పోటీలకు స్వర్ణాంధ్ర విద్యార్థిని
నరసాపురం రూరల్: టేబుల్ టెన్నిస్ సౌత్ జోన్ పోటీలకు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని ఎంపికై ంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరిగిన టేబల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్వర్ణాంధ్ర విద్యార్థినులు మహిళల విభాగంలో ద్వితీయస్థానం సాధించారు. కళాశాలకు చెందిన డి సునీత సౌత్ జోన్ జట్టుకు ఎంపికై ంది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకూ చైన్నెలోని అమిత్ యూనివర్సిటీలో జరిగే సౌత్‌జోన్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆమె కాకినాడ తరుఫున పాల్గొననుంది. ఈ సందర్భంగా క్రీడాకారిణులను చైర్మన్ కేవీ సత్యనారాయణ, కోశాఽధికారి త్రినాథ్, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, ప్రిన్సిపాల్స్ పండరీనాథ్, సురేష్‌కుమార్, ఎంబీఏ హెచ్‌వోడి గ్రేస్, ఫిజికల్ డైరెక్టర్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ గోపీచంద్, స్వామినాధన్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
5న ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈనెల 5వ తేదీన ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బీఏ సాల్మన్ రాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీ. రామారావు, బీ.రెడ్డి దొర ఒక ప్రకటనలో కోరారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళతారని, దీనివల్ల పాఠశాల నిర్వహణ సాధ్యం కాదన్నారు. ప్రత్యేక సెలవు మంజూరు వద్దని, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment