పరిశోధనలకు పేటెంట్లను తెచ్చుకోవాలి
తాడేపల్లిగూడెం: ఆవిష్కర్తలు పరిశోధనా పత్రాలకే పరిమితం కాకుండా వాటికి పేటెంట్లుగా మలుచుకునే స్థాయికి ఎదగాలని ఇవా ఐపీఅండ్‌ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ శ్రీనివాసు మద్దిపాటి అన్నారు. మంగళవారం ఏపీ నిట్‌లో మేధోసంపత్తి హక్కులు–ఆవిష్కర్తల పేటెంట్లు అనే అంశంపై అవగాహన కార్యక్రమంలో శ్రీనివాసు మాట్లాడారు. ఆవిష్కర్తల మేధో సంపత్తికి వారి పరిశోధనలే కొలమానమన్నారు. పేటెంట్ అనేది ప్రభుత్వం అఽధికారికంగా మంజూరు చేసే హక్కు అన్నారు. ఆచార్యులు శాస్త్రి మాట్లాడుతూ పేటెంట్ల ద్వారా ఆవిష్కర్తల గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందన్నారు. ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ పి.శంకర్, డాక్టర్ వి.సుదర్శన దీప, ఆచార్యులు ఫణికృష్ణ, కార్తికేయశర్మ, తదితరులు మాట్లాడారు. ఆచార్యులు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment