భీమవరం: భీమవరం పట్టణంలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు సీపీఎం జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరామ్ తెలిపారు. సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్ కాలంలో ప్రజా పోరాటాలకు సిద్దమయ్యేలా పార్టీ సన్నద్దమవుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సంవత్సరం ముగింపు సందర్భంగా భీమవరం పట్టణంలో 20న భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. 21, 22న ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, చేతి వృత్తి దారులు, ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించేలా ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment