అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్టు
అద్దంకి: అంతర్రాష్ట్ర నేరస్తుడిను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో చీరాల డీఎస్పీ మొయిన్ వివరాలు వెల్లడించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని అంకంపాలెం గ్రామానికి చెందిన సాయి సూర్యతేజ రాత్రి సమయాల్లో షట్టర్లు పగులగొట్టి నగదు, ఇంజన్ ఆయిల్‌తో పాటు కార్లను దొంగిలిస్తుంటాడు. అతడిపై ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, తిరుపతి, కుప్పం, రాజమండ్రి, చిత్తూరు, విజయవాడ ప్రాంతాల్లో 20 కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల చిత్తూరు జైలు నుంచి విడుదలై అద్దంకితో పాటు పలు చోట్ల దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో సాయి సూర్యతేజ గుంటూరు పట్టణంలోని స్వప్నభారత్ నగర్‌కు చెందిన బెల్లంకొండ విజయ్‌కృష్ణతో కలసి గత నెల 25వ తేదీన అద్దంకిలోని శ్రీరామ్ ఏజెన్సీలో షట్టర్ పగులగొట్టి గల్లా పెట్టెలో ఉన్న రూ.15.30 లక్షలు చోరీ చేశారు. దుకాణ యజమాని గోపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం అద్దంకి సమీపంలోని కొంగపాడు డొంక వద్ద నిందితులను అదపులోకి తీసుకున్నారు. రూ.18.48 లక్షల చోరీ సొత్తును రికవరీ చేశారు. ఎనిమిది కేసుల్లో సొత్తు రికవరీ కాగా, మరో ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment