ఏలూరు (టూటౌన్): విద్యార్థుల్ని కొట్టి కులం పేరుతో దూషించిన టీచర్ ఎం.ఎన్.వి.ముత్యాలరావును సస్పెండ్ చేయాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ గత నెల 25న ద్వారకాతిరుమల ఎంపీయుపీ పాఠశాల టీచర్ ఎంన్‌వీ ముత్యాలరావు పాఠశాల విద్యార్థులను వాతలు తేలేలా కొట్టాడన్నారు. నన్ను పేపర్లో ఎక్కిస్తారా.. తక్కువ కులం వాళ్లకి చదువు ఎందుకురా? అని నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడని ఇదే విషయం పాఠశాల హెచ్‌ఎంకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. షోకాజ్ నోటీసు జారీ చేసి మూడు నాలుగు రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment