భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని వ్యాపార వినియోగ విద్యుత్ కనెక్షన్ల ఎంఎస్‌ఎంఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గ్రామ వార్డు సచి వాలయ సిబ్బందితో గూగుల్ మీట్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ సర్వేకు సంబంధించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజస్ పారిశ్రామిక వేత్తలు సర్వేకు పూర్తిగా సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఇంతవరకు బ్యాంకు ఖాతాలకు 87 శాతం ఎన్‌పీసీఐలు అనుసంధానం చేశామన్నారు. అత్తిలి, ఆకివీడు, యలమంచిలి, పోడూరు, తాడేపల్లిగూడెం అర్బన్, పెనుమంట్ర, నరసాపురం మండలాల్లో సర్వే పురోగతిని పెంచాలన్నారు. హౌస్ హోల్డ్ జియో ట్యాగ్‌లో ఆకివీడు, పోడూరు, గణపవరం, నరసాపురం, పెంటపాడు, మండలాలు భీమవరం, తాడేపల్లిగూడెం వెనుకబడి ఉన్నాయన్నారు.
9 నుంచి ఉండి రైల్వే గేటు మూసివేత
ఉండి: రైల్వే ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా ఈ నెల 9 ఉదయం 7 గంటల నుంచి 18 సాయంత్రం 7 గంటల వరకు ఉండి రైల్వే గేటును మూసి వేస్తున్నట్లు సెక్షన్ ఇంజనీర్ ఎండీ రెహమాన్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ట్రాక్ మరమ్మతులతో పాటు గేటు వద్ద రోడ్డు మరమ్మతు చేపడుతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment