వచ్చే ఏడాది కార్మిక సెలవులు ఇవే
ఏలూరు (టూటౌన్): ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం 1988 కింద జోన్–2లోని షాపులు ఎస్టాబ్లిష్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన జాతీయ, పండుగ సెలవు దినాలు ప్రకటిస్తూ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఏ.రాణి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 26, మే 1, ఆగస్టు 15, అక్టోబరు 2 జాతీయ సెలవు దినాలు కాగా.. జనవరి 15, ఫిబ్రవరి 26, మార్చి 31, నవంబరు 1, డిసెంబరు 25 పండుగ సెలవుదినాలని ప్రకటించారు.
వాహన్ పోర్టల్ ద్వారానే రవాణా సేవలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వాహనదారులకు సంబంధించిన అన్ని రకాల రవాణా శాఖ సేవలను ఇకపై వాహన పోర్టల్ ద్వారానే పొందాలని ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకూ ఈ–ప్రగతి పోర్టల్ ద్వారానే రవాణా శాఖ సేవలను అందించామని, సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ–ప్రగతి పోర్టల్ నిలిపివేసినట్టు తెలిపారు. దాని స్థానంలో వాహన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఇబ్బందులుంటే 9154294210, 91542 94105 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment