అంతర్ జిల్లాల దొంగల ముఠా అరెస్ట్
భీమడోలు: అంతర్ జిల్లాల దొంగల ముఠాను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3 లక్షల చోరీ విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ గురువారం వివరాలు వెల్లడించారు. సింగరాయకొండ ప్రాంతానికి చెందిన నిందితుడు రంగనాధం కిరణ్, మరో మహిళ ఎల్లుట్ల నారాయణమ్మ, ఆమె కుమారుడు వసంతకుమార్ ఒక ముఠాగా ఏర్పడి రహదారి పక్కనే ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. వారిపై నెల్లూరు జిల్లా గూడూరు పోలీస్‌స్టేషన్‌లో 58 కేసులు నమోదయ్యాయి. అక్కడ నుంచి వచ్చి కై కలూరులో ఓ ఇంటిని అద్దెలో ఉంటూ భీమడోలు, ఉంగుటూరు, నల్లజర్ల, నరసాపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. దీనిపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐ జోసఫ్ విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై వై.సుధాకర్‌తో పాటు హెచ్‌సీలు సూరిశెట్టి శ్రీనివాసరావు, బాబి, కానిస్టేబుల్ వెంకట్ బృందంగా ఏర్పడి నిందితులను భీమడోలు జంక్షన్‌లోని బృందావన హోటల్ దగ్గరలో వారిని పట్టుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రంగనాధం కిరణ్‌పై 43 కేసులు, నారాయణమ్మపై 8 కేసులు, వసంతకుమార్‌పై 7 కేసులు నమోదయ్యాయి. వారిని అరెస్ట్ చేసి భీమడోలు కోర్టుకు హాజరుపర్చారు. నిందితులను పట్టుకున్న సీఐ యూజే విల్సన్, పోలీసు బృందాన్ని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment