సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలి
మాజీ మంత్రి కొట్టు డిమాండ్
తాడేపల్లిగూడెం: తిరుపతిలో టోకెన్ టికెట్ల కౌంటర్ల వద్ద జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ ఈఓ బాధ్యత వహించి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన అత్యంత దారుణమని, తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారు. ఇది ఆలయ పాలకవర్గం, కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తిరుమల తిరుపతిలో ఉండే అడ్మినిస్ట్రేషన్ దేశంలోనే గొప్పదన్నారు. అటువంటి వ్యవస్థను అయో ధ్యలో ఏర్పాటుచేసేలా సర్వే చేశారని చెప్పారు. అయితే అలాంటి వ్యవస్థను కూటమి ప్రభు త్వం నిర్వీర్యం చేసిందన్నారు. గత ఐదేళ్లలో దేవదాయ శాఖను అభివృద్ధి చేశామని, పలు సంస్కరణలు చేసిన ఘనత కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దళారీ వ్యవస్థను ఏర్పాటు చేశారనీ విమర్శించారు. తొక్కిసలాట లో ఆరుగురు దుర్మరణం చెందారని, దీనికి ఎవరూ సమాధానం చెబుతారని, సనాతన ధర్మం కోసం మాట్లాడే పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారని కొట్టు నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment