ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు
ఏలూరు టౌన్: ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గత నెల 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 4,976 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయగా దేహదారుఢ్య పరీక్షలకు 3,453 మంది హాజరయ్యారు. వారిలో 1,975 మంది అభ్యర్థులు ఎంపికై నట్టు ఎస్పీ శివకిషోర్ చెప్పారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, తూర్పుగోదావరి ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, ఎస్‌బీ సీఐలు మల్లేశ్వరరావు, బి.ఆదిప్రసాద్, ఏఆర్ ఆర్‌ఐ పవన్‌కుమార్, పోలీసు అధికారులు దేహదారుఢ్య పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో సమర్థవంతంగా పనిచేశారు.
మొత్తంగా 3,453 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల హాజరు
1,975 మంది ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment