ముక్కోటికి భద్రత కట్టుదిట్టం
ద్వారకాతిరుమల: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఏ లూరు జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో శుక్రవారం ఉద యం 5 గంటల నుంచి జరుగనున్న శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏలూ రు, నూజివీడు సబ్ డివిజన్లలోని పోలీస్‌స్టేషన్ల నుంచి 120 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవస్థానం వద్ద ఏర్పాట్లను గురువారం రాత్రి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. దేవస్థానం అధికారులు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సైలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
సర్వం సిద్ధం : శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశా రు. ఉత్తర ద్వారాన్ని, స్వామివారు ఆశీనులయ్యే ప్రాంతాన్ని పచ్చిపూలతో అలంకరించే పనులు అర్ధరాత్రి వరకు సాగాయి. అలాగే వెండి గరుడ, శేష వాహనాలను సిద్ధం చేశారు.
రాత్రికే చేరుకున్న భక్తులు : ఉత్తర ద్వార దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తు లు, గోవింద స్వాములు రాత్రికే క్షేత్రానికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు.
ద్వారకాతిరుమలలో ప్రత్యేక బందోబస్తు
నేడు ఉదయం 5 గంటల నుంచిశ్రీవారి ఉత్తర ద్వార దర్శనం
Comments
Please login to add a commentAdd a comment