శృంగవృక్షంలో వైద్య శిబిరం
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
మొగల్తూరు మండలం కొత్తపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. IIలో u
పాలకోడేరు: ‘శృంగవృక్షంలో డయేరియా విజృంభణ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. వీరవాసరం పీహెచ్‌సీ డాక్టర్ జె.లీలాలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేయగా జిల్లా పర్యవేక్షణ అధికారి డాక్టర్ ధనలక్ష్మి, జిల్లా ఎపిడిమాలజిస్ట్ సుభాష్, ఎంపీహెచ్‌ఈఓ సుకుమార్ సందర్శించారు. ఇంటింటా సర్వే నిర్వహించడంతో పాటు గ్రామంలో మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్, గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గ్రామంలో సుమారు 40 మందికి చిన్నపాటి వ్యాధులను గుర్తించి వైద్యం అందిస్తున్నామన్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామంలోని రావిచెరువులోని కలుషిత నీటిని సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గులిపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సోము రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment