గళమెత్తిన మున్సిపల్ కార్మికులు
భీమవరం: మున్సిపల్ కార్మికులకు సమ్మె ఒప్పందలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ పనికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు మూడేళ్లుగా రావాల్సిన సరెండర్ లీవులు విడుదల చేయాలన్నారు. కూటమి అధికారం చేపట్టి ఏడు నెలల గడుస్తున్నా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణన్నారు. కార్మికులు పనిచేయడానికి సరైన పనిముట్లు, వాహనాలు లేవని వెంటనే సమకూర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు ఎం. ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నీలాపు రాజు, బంగారు వరలక్ష్మి, బంగారు ఏసేబు, ధనాల చినపెద్దిరాజు, నీలాపు నాగేశ్వరరావు, అప్పన్న, మాడుగుల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment