ఏలూరు (టూటౌన్): జిల్లాలో గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు ప్రభుత్వం హామీలేని రుణాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద కౌలు రైతు సంఘం ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ జిల్లాలో 70 నుంచి 80 శాతం మంది కౌలురైతులే పంటలు పండిస్తున్నారన్నారు. అయితే బ్యాంకులు వీరికి పంట రుణాలు మంజూరులో సహకరించడం లేదని ఆరోపించారు. ముసునూరు మండలం వలసపల్లి గ్రామంలో 70 మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులు కలిగి ఉండగా ఇద్దరికి మాత్రమే రుణాలిస్తామని బ్యాంకర్లు ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. అనంతరం వ్యవసాయ శాఖ జేడీకి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment