● పనుల్లో జాప్యం.. ప్రయాణం నరకం
భీమవరం–అత్తిలి మార్గంలో ఆర్‌అండ్‌బీ రహదారి ఆధునికీకరణ పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇరగవరం మండలంలోని గవర్లపాలెం నుంచి అత్తిలి వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కంకర, మెటల్ చిప్స్‌తో లెవెల్ చేశారు. అయితే తారుతో లేయర్ వేయకపోవడంతో కంకర పైకి లేచి వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే దుమ్ము భారీగా వ్యాపిస్తోంది. అలాగే అత్తిలి నుంచి కొమ్మర, ఈడూరు మీదుగా భీమవరం వెళ్లే రోడ్డు గోతులమయంగా మారింది. వీటిపై ఆర్‌అండ్‌బీ డీఈ వరలక్ష్మిని వివరణ కోరగా త్వరలో గవర్లపాలెం–అత్తిలి వరకు రోడ్డు ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని చెప్పారు. – అత్తిలి
Comments
Please login to add a commentAdd a comment