ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా
భీమవరం(ప్రకాశం చౌక్): సంక్రాంతి పండగకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల టికెట్ చార్జీల బాదుడుపై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు రావడం, జిల్లా రవాణా శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లడంపై జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు స్పందించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సు లపై నిఘా పెట్టారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతంలో ఓ బృందం, భీమవరం, పాలకొల్లు ప్రాంతంలో మరో బృందంతో ప్రత్యేక తనిఖీలు చేయిస్తున్నారు. రెండు రోజుల్లో 96 కేసులు రాసి రూ.14.35 లక్షల జరిమానా విధిం చారు. వేల రూపాయలు జరిమానా విధించారు. అలాగే ట్యాక్స్ పెనాల్టీ చెల్లించకుండా పర్మిట్ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న రెండు వాహనాలను సీజ్ చేశారు. డీటీఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పండుగల త ర్వాత కూడా ప్రత్యేక బృందాల తనిఖీలు కొనసాగుతాయని, అధిక చార్జీలు వసూలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment