ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉభయగోదావరి జిల్లాల నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న వారికి గత ఏడాది నవంబర్ 11న విజయవాడలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో స త్కారం జరగలేదని, అటువంటి ఉపాధ్యాయులకు తిరిగి ముఖ్యమంత్రి ద్వారానే సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.రత్నం బాబు, జి మోహన్‌రావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో 26 మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా అవార్డుల ప్రధానోత్సవం వాయిదా పడిందని పేర్కొన్నారు. వీరికి అవార్డులను జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ద్వారా అందించడానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేయడం సరికాదని తెలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారు ముఖ్య మంత్రి చేతులమీదుగా అవార్డును అందుకోవడం గొప్ప గౌరవమని, అలాంటి గౌరవాన్ని దూరం చేయడం తగదన్నారు. కమిషనర్ ఉత్తర్వులను సవరించి జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి చేతులమీదుగా పురస్కారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment