బాల్య వివాహాలతో అనర్థాలు
భీమడోలు: బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని గుండుగొలను వైద్యాధికారి కె.శ్రీలక్ష్మి అన్నారు. గుండుగొలనులో బాల్య వివాహాల నిరోధంపై ర్యాలీ నిర్వహించారు.
సంక్షేమం జాడలేక..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదోక సంక్షేమ పథకం చేతికంది పేదవర్గాల వద్ద డబ్బులుండటం వల్ల పండుగల సమయంలో మార్కెట్లు కళకళలాడేవి. ప్రస్తుతం సూపర్ సిక్స్ అంటూ వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదు. విపత్తులతో తొలకరి పంటకు నష్టం రాగా ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వలేదు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు సరిగా పనులేకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం తదితర కారణాలతో జనం వద్ద డ బ్బులు లేకుండా పోయాయి. ఇప్పటికే క్రి స్మస్, న్యూ ఇయర్ అమ్మకాలు లేక పెద్ద పండుగపైనే ఆశలు పెట్టుకున్న వ్యాపారులకు సంక్రాంతి సేల్స్ తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. చిన్న దుకాణాలతో పాటు షోరూమ్‌లు, మాల్స్‌లో సైతం అమ్మకాలు తగ్గిపోయాయి. జిల్లాలో వ్యాపార కేంద్రాలుగా పేరొందిన భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డు, మల్టీఫ్లెక్స్ ఏరియా, డీఎన్‌ఆర్ కళాశాల రోడ్డు, తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌లోని కేఎన్ రోడ్డు, తాలుకా ఆఫీస్ రోడ్డు, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూరు రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్‌లు రద్దీ లేక వెలవెలబోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment