ఐటీడీఏ పీఓగా రాములు నాయక్
బుట్టాయగూడెం: కేఆర్‌పురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా కేతావత్ రాముల నాయక్ నియమితులయ్యా రు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నియామక ఉత్తర్వులు శనివారం వెలువడ్డాయి. కృష్ణా జిల్లా సర్వశిక్షా అభియాన్ పీఓగా పనిచేస్తున్న రాముల నాయక్ ఇక్కడికి పీఓగా రాను న్నారు. ఆయన గతంలో గుంటూరు జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేశారు. తర్వాత అమరావతి సీఏడీ, సీఎంఓ కార్యాలయాలు, ఏలూరులో విజి లెన్స్ శాఖలో పనిచేశారు. కాగా కేఆర్‌పురం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న ఎం.సూర్యతేజ నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అప్పటినుంచి జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఇన్‌చార్జి పీఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment