● భీమవరం: భీమవరం రూరల్‌లోని డేగాపురం, కొవ్వాడ అన్నవరం, వీరవాసరం మండలం వీరవాసరం, కొణితివాడలో భారీ బరులు, నందమూరు గరువు, ఉత్తరపాలెం, మత్య్సపురి, నౌడూరులో చిన్న బరులు సిద్ధం చేస్తున్నారు.
● ఉండి: ఉండి మండలంలో ఉండి, పాములపర్రు, కోలమూరు, యండగండి, మహాదేవపట్నం, వాండ్రం, చెరుకువాడ, కాళ్ల మండలంలో పెదఅమిరం, సీసలిలో భారీ బరులు సిద్ధం చేశారు. కాళ్ల, దొడ్డనపూడి, కాళ్లకూరు, ఏలూరుపాడు, మాలవానితిప్ప, పాలకోడేరు మండలంలో శృంగవృక్షం, పెన్నాడ, వేండ్ర, మోగల్లు, పాలకోడేరు, గొల్లలకోడేరు, కోరుకొల్లు, విస్సాకోడేరు, ఆకివీడు మండలంలో అయి భీమవరం, కుప్పనపూడి, మాదివాడ, చినకాపవరం, సిద్దాపురం గ్రామాల్లో బరులను సిద్ధం చేశారు.
● తాడేపల్లిగూడెం: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి సమీపంలో పెద్ద బరిని ఏర్పాటుచేయగా, రూరల్‌లోని పెదతాడేపల్లి, వెంకట్రామన్నగూడెం, పట్టెంపాలెం, కడియద్ద, నందమూరు, నవాబ్‌పాలెం, అప్పారావుపేట, పెంటపాడు మండలంలో పెంటపాడు, కె.పెంటపాడు, అల్లంపురం, దర్శిపర్రులో పందాల బరులు ఏర్పాటు చేస్తున్నారు.
● ఆచంట: పెనుమంట్ర మండలంలోని పెనుమంట్ర, మార్టేరు, వెలగలేరు, ఆలమూరు, వెలగలవారి పాలెం, జుత్తిగ, నత్తారామేశ్వరం, పెనుగొండ మండలంలోని పెనుగొండ వడలి, దొంగ రావిపాలెం, పెళ్లికూతురమ్మ చెరువు, ములపర్రు, చిన్న మల్లం, ఆచంట మండలంలో ఆచంట, వల్లూరుతోట, కొడమంచిలి గ్రామాల్లో బరులు ఏర్పాటు చేస్తున్నారు.
● పాలకొల్లు: పాలకొల్లు మండలం పూలపల్లిలో రెండు, వడ్లవానిపాలెంలో ఒకటి, యలమంచిలి మండలం కలగంపూడి, యలమంచిలి గ్రామాల్లో పెద్ద బరులను ఏర్పాటు చేస్తున్నారు. పాలకొల్లు రూరల్ తిల్లపూడి, శివదేవునిచిక్కాల, లంకలకోడేరు, దగ్గులూరు, చింతపర్రు, వాలమర్రు, యలమంచిలి మండలం కొంతేరు, కాజ, మేడపాడు, మట్లపాలెం, కట్టుపాలెం, బూరుగుపల్లి, కనకాయలంక గ్రామాల్లో చిన్న బరులు సిద్ధం చేస్తున్నారు.
● నరసాపురం: నరసాపురం ప్రభుత్వాసుపత్రి వెనుక నాలుగు, వీవర్స్ కాలనీ, ఆదర్శనగర్ వద్ద మూడు, నరసాపురం రూరల్‌లోని వేములదీవి, లక్ష్మణేశ్వరం, తూర్పుతాళ్లు, పసలదీవి, పితానిమెరక, మల్లవరం, నవరసపురం గ్రామల్లో, మొగల్తూరు మండలంలో పేరుపాలెం, మోళ్లపర్రు, కాళీపట్నం, రామన్నపాలెం గ్రామాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు.
● తణుకు: అత్తిలి మండలం కేఎస్ గట్టు, ఎల్‌ఎన్ పురం, గుమ్మంపాడు, తణుకు మున్సిపాలిటీలో నాలుగుచోట్ల, తణుకు మండలంలో తేతలిలో 3, వేల్పూరులో 2, దువ్వ, మండపాకలో ఒక్కో బరి సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment