ఆపద్బాంధవుడు
ఏలూరు నగరంలో రోడ్లపై తిరిగే ఆవులు ప్రమాదాలకు గురైతే వాటిని సంరక్షించే వారు ఎవరా అని ఆరా తీస్తే ఠక్కున గుర్తొచ్చేది సామాజిక కార్యకర్త మల్లిపూడిరాజు. 8లో u
కొల్లేరు ప్రజలను ముంచిన కూటమి ప్రభుత్వం
ఏలూరు రూరల్ : కూటమి ప్రభుత్వం కొల్లేరు ప్రజలకు శాపంగా మారిందని వైఎస్సార్‌సీపీ వడ్డి కుల సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజీవ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఏలూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ అంశం కొల్లేరు ప్రజలను మరోసారి ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసమర్ధ పాలన కారణంగానే సుప్రీంకోర్టులో కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చిందన్నారు. కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్న 3.50 లక్షల మంది ప్రజల మనోభావాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఎన్నికల ముందు కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు సమస్యను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు 120 జీవో జారీ చేశారని దాని ఫలితంగా 2007లో కొల్లేరు ప్రక్షాళన జరిగిందన్నారు. లక్షలాది మంది కొల్లేరు ప్రజలు నిరాశ్రయులయ్యారని, ఉపాధి కోసం సొంత ఊళ్లు వదిలి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొల్లేరు ప్రజలు నష్టపోయిన 15 వేల ఎకరాల భూములకు పరిహారం చెల్లించి, భూమి లేని పేదలకు కొల్లేరు పరసరాల్లోని ప్రభుత్వ భూములను పంచాలని సంజీవ్‌కుమార్ డిమాండ్ చేశారు.
బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలి
ఏలూరు(మెట్రో): ఆర్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం మంగళవారం అశోక్ నగర్ ఏరియాలో ఉన్న శ్రీ గౌరీ కళ్యాణమండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్‌బీఐ జీఎం ఆర్‌కే మహాన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలన్నారు. బ్యాంక్ సేవింగ్స్, బీమా పథకాలు, సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక క్రమశిక్షణ ప్రాముఖ్యత గురించి వివరించారు. డీఆర్‌డీఏ పీడి ఆర్.విజయరాజు, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ ఎన్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment