యలమంచిలి ఇన్‌చార్జి ఎంపీపీగా గొల్లపల్లి
యలమంచిలి: యలమంచిలి ఇన్‌చార్జి ఎంపీపీగా గొల్లపల్లి శ్రీనివాసరావును నియమిస్తూ మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత తెలిపారు. 2021లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. ఆ పార్టీకి చెందిన యలమంచిలి ఎంపీటీసీ సభ్యురాలు రావూరి వెంకట రమణ, ఏనుగువానిలంక ఎంపీటీసీ వినుకొండ ధనలక్ష్మి ఎంపీపీ స్థానాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. రావూరి వెంకటరమణ గతేడాది మార్చిలో రాజీనామా చేశారు. ఎలక్షన్ కోడ్ రావడం, ప్రభుత్వం మారడంతో అప్పటి నుంచి ఎంపీపీ ఎన్నిక జరగలేదు. వెంకటరమణ ఎంపీపీగా ఉన్న సమయంలో ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ–1గా, మరో ఎంపీటీసీ కొప్పాడి శ్రీనుబాబు వైస్ ఎంపీపీ–2గా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని ఎంపీపీగా నియమించి, త్వరితగతిన ఎన్నిక నిర్వహించాలని కోరుతూ కలెక్టర్‌ను కలిశారు. ఎట్టకేలకు గొల్లపల్లి శ్రీనివాసరావును ఇన్‌చార్జి ఎంపీపీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment