అపరిష్కృత కేసులపై దృష్టి పెట్టాలి
భీమవరం: అపరిష్కృతంగా ఉన్న ప్రాపర్టీ కేసులు, మహిళలకు సంబంధించిన కేసులపై దృష్టి కేంద్రీకరించి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ముఖ్యమైన కేసుల గురించి ఎస్పీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా ముఖ్యమైన ప్రాపర్టీ కేసుల గురించి ఆరా తీస్తూ, ఇప్పటికే ముద్దాయిలు అరెస్ట్ అయిన కేసులలో త్వరితగతిన చార్జ్‌షీట్ దాఖలు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ చట్ట పరిధిలో న్యాయం చేకూర్చాలని నిర్లక్ష్యం వహించకుండా పరిష్కారం చూపాలని అన్నారు. పోలీస్ స్టేషన్ వారీగా ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని, కేసులు దర్యాప్తు తొందరగా పూర్తి చేయాలన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తప్పనిసరిగా గ్రామ సందర్శన చేయాలని, ప్రజలతో మమేకమై గ్రామంలో సమస్యలను గుర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులును గుర్తించి, ప్రాథమిక స్థాయిలోనే బైండోవర్ చేయలన్నారు. గంజాయి నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతని ఇవ్వాలని చెప్పారు. సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment