![నయన మ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10jrgdwa03-290069_mr-1739215403-0.jpg.webp?itok=YoIgoFRg)
నయన మనోహరం.. నారసింహుని కల్యాణం
ద్వారకాతిరుమల : నమో నారసింహ స్మరణలు మార్మోగాయి. జగదానంద కారకుడైన నారసింహుని దివ్య తిరుకల్యాణోత్సవ వేళ ఐఎస్ జగన్నాథపురం క్షేత్రం ఇల వైకుంఠాన్ని తలపించింది. వేలాదిగా వచ్చిన భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకించి తరించారు. ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్ర దత్తత ఆలయం ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరిపై కొలువైన లక్ష్మీ నారసింహుని కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణ తంతు నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుని ఉత్సవ మూర్తులను సుందరగిరిపై నుంచి ఉదయం కొండ కింద కల్యాణ మండపం వద్దకు పల్లకీ వాహనంలో తీసుకొచ్చారు. ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అలంకరించారు. పరిణయ వేడుకల్లో ఒక్కో ఘటాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కన్యాదానం జరిపి ఉదయం 11.10 గంటల సుముహూర్త సమయంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. అనంతరం మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను జరిపించారు. ప్రభుత్వం తరఫున గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, దేవస్థానం తరఫున ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. వేడుక అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి అన్నప్రసాదాన్ని అందించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, సూపరింటెండెంట్ రమణ రాజు, డీఈ టి.సూర్యనారాయణ, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
● ఐఎస్ జగన్నాథపురంలో అట్టహాసంగా వేడుక
● పోటెత్తిన సుందరగిరి
![నయన మనోహరం.. నారసింహుని కల్యాణం1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10jrgdwa07-290069_mr-1739215403-1.jpg)
నయన మనోహరం.. నారసింహుని కల్యాణం
![నయన మనోహరం.. నారసింహుని కల్యాణం2](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10jrgdwa06-290069_mr-1739215403-2.jpg)
నయన మనోహరం.. నారసింహుని కల్యాణం
![నయన మనోహరం.. నారసింహుని కల్యాణం3](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10jrgdwa02-290069_mr-1739215403-3.jpg)
నయన మనోహరం.. నారసింహుని కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment