రైతుల సమక్షంలోనే రీసర్వే | - | Sakshi
Sakshi News home page

రైతుల సమక్షంలోనే రీసర్వే

Published Tue, Feb 11 2025 12:54 AM | Last Updated on Tue, Feb 11 2025 12:54 AM

రైతుల

రైతుల సమక్షంలోనే రీసర్వే

ఆకివీడు: రీసర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి సూచించారు. మండలంలోని గు మ్ములూరులో రీ సర్వే ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. రైతులకు ముందుగా నోటీసులు ఇవ్వాలని, సరిహద్దులు తెలుసుకుని సర్వే చేయాలని సర్వేయర్లకు సూచించారు. రైతులు ఫీల్డ్‌లోకి వచ్చేలా చూడాలన్నారు. జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున రీసర్వే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ఈ–క్రాప్‌ నమోదు, యూనిక్‌ ఐడీపై సూచనలిచ్చారు. తహసీల్దార్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, వీఆర్వో బందా హరిశ్చంద్ర ప్ర సాద్‌, సర్వేయిర్‌ సాయి ఉన్నారు.

బాల్య వివాహాలతో అనర్థాలు

తాడేపల్లిగూడెం (టీఓసీ) : స్థానిక వీకర్స్‌ కాలనీ మూడో వార్డులో బాల్య వివాహాన్ని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, సిబ్బంది సోమవారం అడ్డుకు న్నారు. అదే ప్రాంతానికి చెందిన యువకుడితో బాలికకు ఈనెల 20న వివాహం చేయనున్నారనే విషయం తెలిసి ఇక్కడకు వచ్చి బాలిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండే వరకు వివాహం చేయరాదని, బాల్యవివాహాలతో అనర్థాలు తప్పవని కౌన్సెలింగ్‌ ఇ చ్చారు. వివాహ వయసు వచ్చేవరకూ పెళ్లి చే యమని వారి వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. డ్రాప్‌అవుట్‌ అయిన బాలికను స్కూల్‌ లో జాయిన్‌ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సీహెచ్‌ దుర్గాభవాని, మహిళా పోలీస్‌ విజయకుమారి, అంగన్‌వాడీ టీచర్‌ వాణి, టౌన్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు.

వాసవీ మాత హుండీ ఆదాయం లెక్కింపు

పెనుగొండ: పెనుగొండలో నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 101 రోజులకు రూ.8,09,083 ఆదా యం వచ్చినట్టు ఈఓ గుబ్బల రామ పెద్దింట్లురావు తెలిపారు. జిల్లా డీఈఓ ఈవీ సుబ్బారావు పర్యవేక్షించారు. వడలి, జుత్తిగ ఆలయాల ఈఓ లు మన్నే శ్రీనివాసు, పీఆర్‌కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, నూలి చినగణేష్‌, ఆలయ అర్చకులు కోట వెంకట సుబ్రహ్మణ్మం పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

భీమవరం : జిల్లాలో ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 73 కేంద్రాల్లో ఉద యం షిఫ్టులో 3,354 మందికి 3,250 మంది, మధ్యాహ్నం షిఫ్టులో 2,327 మందికి 2,283 మంది హాజరయ్యారని ఇంటర్మీడియెట్‌ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు తెలిపారు.

పాదుల తొలగింపు

తణుకు అర్బన్‌ : ‘నిలువెత్తు నిర్లక్ష్యం’ శీర్షికన ‘సాక్షి’లో సో మవారం ప్రచురించిన కథనా నికి విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. తణుకు సజ్జాపురంలో విద్యుత్‌ స్తంభం, ఎన్జీ ఓ కాలనీలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాల వెనుక ప్రాంతంలో ఉన్న విద్యుత్‌ స్తంభాలపై పాదుల తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

శిశు ఆధార్‌ సేవలు

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ఆధ్వర్యంలో 0–5 ఏళ్ల చిన్నారులకు ఉచిత ఆధార్‌ సే వలు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎంఎస్‌ రాజు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ ఆస్పత్రిలో పుట్టిన పిల్లలకు బర్త్‌ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్‌ నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గైనిక్‌ విభాగాధిపతి లావణ్య, నర్సింగ్‌ సూ పరింటెండెంట్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రైతుల సమక్షంలోనే రీసర్వే 1
1/3

రైతుల సమక్షంలోనే రీసర్వే

రైతుల సమక్షంలోనే రీసర్వే 2
2/3

రైతుల సమక్షంలోనే రీసర్వే

రైతుల సమక్షంలోనే రీసర్వే 3
3/3

రైతుల సమక్షంలోనే రీసర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement