![శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10pklpem01-290089_mr-1739215405-0.jpg.webp?itok=e07Vf6Xg)
శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
పెనుమంట్ర: నత్తారామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ దాసి రాజు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆర్డీఓ అధికారులతో సమీక్షించారు. గ్రామంలో సిద్ధాంతం–రామేశ్వరం, తాడేపల్లిగూడెం–మార్టేరు రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మద్యం బెల్టుషాపులు లేకుండా చూడాలన్నారు. మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటల వరకు దుకాణదారులు విక్రయాలు జరిపేలా అనుమతి ఇవ్వాలని ఆలయ కమిటీ సభ్యులను కో రారు. సర్పంచ్ వెలగల ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ ఆలమూరులో జగనన్న లేఅవుట్లలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment