![ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ నిట్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10tpc02-290052_mr-1739215404-0.jpg.webp?itok=89QyQKOb)
ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ నిట్
తాడేపల్లిగూడెం : వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఏపీ నిట్ ఉందని ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్‌వీ రమణరావు అన్నారు. సోమవారం నిట్ ప్రాంగణంలోని సర్వేపల్లి రాధాకృష్ణన్ భవన సముదాయంలో కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సహకారం రూ.7.50 కోట్లతో ఏర్పాటుచేసిన కామన్ రీసెర్చ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ హబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పునరుత్పాదక శక్తి వనరులు, విద్యుత్ రంగాల్లో పరిశోధనలు చేపట్టాలన్నారు. పరిశోధనా ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలన్నారు. ఈ ప్రాజెక్టు ఏపీ నిట్‌కు రావడానికి కృషిచేసిన డాక్టర్ సందీప్, డాక్టర్ శంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్త సీఆర్‌డీహెచ్ విభాగాఽధిపతి, డాక్టర్ విపిన్ సి.శుక్లా మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మరింత పు రోగతి సాధించేలా ప్రోత్సహించడమే ఈ హబ్ ముఖ్య ఉద్దేశమన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, డీన్ జీఆర్‌కే శాస్త్రి హబ్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రాజెక్టు ఆఫీసర్లు వి.సందీప్, పి.శంకర్ మాట్లాడుతూ ఈ హబ్ దేశంలో 18వది కాగా, ఎన్‌ఐటీలలో మొట్టమొదటది అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment