![నార్కట్‌పల్లిలోని భగవాన్‌శర్మ ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/22/21nkl101-230067_mr_0.jpg.webp?itok=9BI3-5Vr)
నార్కట్‌పల్లిలోని భగవాన్‌శర్మ ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు
నార్కట్‌పల్లి : గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. నార్కట్‌పల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని శివాలయం పూజారి భగవాన్‌శర్మ కుటుంబ సభ్యులు శనివారం ఇంటికి తాళం వేసి శ్రీశైలం పుణ్య క్షేత్రానికి వెళ్లారు. గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు భగవాన్‌శర్మ ఇంటి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. వస్తువులను చిందరవందరగా చేసి అందినకాడికి అపహరించుకుపోయారు. సాయంత్రం భగవాన్‌శర్మ పని మనిషి ఇంటికి వచ్చి చూసి యజమానికి సమాచారం ఇచ్చింది. దీంతో భగవాన్‌శర్మ కుటుంబ సభ్యులు పుణ్య క్షేత్రానికి వెళ్లకుండానే అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. దుండగులు బీరువాలో దాచిన రూ.1.70లక్షలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నర్సిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment