వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకించాలి | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకించాలి

Published Mon, Aug 26 2024 9:40 AM | Last Updated on Mon, Aug 26 2024 9:40 AM

-

భువనగిరిటౌన్‌: వక్ఫ్‌ బోర్డు అధికారాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును తీసుకొస్తుందని, దీనిని ప్రజలు వ్యతిరేకించాలని ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జహంగీర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దుంపల మల్లారెడ్డి ట్రస్ట్‌ భవనంలో ఆవాజ్‌ ఆధ్వర్యంలో వక్ఫ్‌ సవరణ– 2024 బిల్లుపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వక్ఫ్‌ బోర్డులో ఇతరులకు ప్రవేశం కల్పించడం, వక్ఫ్‌ బోర్డు భూములను ప్రభుత్వ భూములుగా మార్చే కుట్రలో భాగంగానే కలెక్టర్లకు విశేష అధికారాలిస్తూ బిల్లు తేవడం, ట్రిబ్యునల్‌ను సవాల్‌ చేయడం లాంటి 44 సవరణలు తీసుకొచ్చారని, వీటితో వక్ఫ్‌ భూముల స్వాహా చేయడంతోపాటు, ముస్లింల సంక్షేమానికి నష్టం జరుగుతుందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్‌ భూములు, చారిటీ భూముల జోలికి వస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. యూసుఫ్‌ అలీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆవాజ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్కే లతీఫ్‌, ఎండి పాషా, బట్టు రామచంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ, నాయకులు ఎస్‌.కె హమీద్‌, ఎండీ గౌస్‌, ఎండీ ముక్తార్‌ హుస్సేన్‌, ఎండీ జహీరుద్దీన్‌, ఎండీ సుజావుద్దీన్‌, ఎండీ సలీం, ఎండీ ఉస్మాన్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జహంగీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement