వలంటీర్లను నియమించాలి
ప్రాథమిక పాఠశాలల్లో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. సింగిల్ టీచర్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులు నష్టపోతున్నారు. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలకు వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కొందరు ఉపాధ్యాయులు బదిలీ అయినా రిలీవ్ కాలేదు. సింగిల్ టీచర్ ఉన్న చోట విద్యా వలంటీర్లను నియమించాలి.
–ముక్కెర్ల యాదయ్య,
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఒక్కరే 18 సబ్జెక్టులు బోధిస్తున్నారు
ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. సింగిల్ టీచర్‌తో నడుస్తున్న పాఠశాలల్లో ఉపాధ్యాయులకు అనారోగ్య సమస్యలు వస్తే సెలవు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కరే టీచర్ ఉండడం వల్ల 18 సబ్జెక్టులు బోధించడం భారంతో కూడుకున్న పని. అందుకే జీఓ నంబర్ 25ను సవరించి విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయులను నియమించాలి. –ధర్మారపు వెంకటయ్య,
పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
బదిలీ అయినా అక్కడే విధులు
సుమారు 14 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల బది లీలు జరిగాయి. సింగిల్ టీచర్‌తో నడుస్తున్న పాఠశాల్లోని ఉపాధ్యాయుల్లో చాలా మంది బదిలీ అయ్యారు. కానీ, ఆ స్థానంలోకి మరో ఉపాధ్యాయులు రాకపోవడంతో రెండు నెలల నుంచి రిలీవ్ కాక అక్కడే పనిచేస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. డీఎస్పీ ఫలితాలు ప్రకటించారు. జాప్యం చేయకుండా ఉపాధ్యాయులను నియమించాలి.
–మైలారం సత్తయ్య, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
●
Comments
Please login to add a commentAdd a comment