విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
చౌటుప్పల్ : విద్యార్థులు సాంకేతికత పట్ల ఆసక్తిని పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని హైదరాబాద్‌లోని ఐఐసీటీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వత్సలరాణి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో సైన్స్ అండ్ టెక్‌సిరి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో సైన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సైన్స్ మేళా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. 100 రకాల ప్రయోగాలను చేసి చూపించారు. విద్యార్ధులు ఎంతగానో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్ధులు తమ తరగతి గదిలోనే ప్రయోగాల వైపునకు దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు తమ ఆలోచన విధానాలను శాసీ్త్రయ కోణంలో తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ సైంటిస్ట్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు కర్నె శివకుమార్, సిరి వాలంటరీలు ఎల్లేష్, అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
ఫ ఐఐసీటీ సైంటిస్ట్ డాక్టర్ వత్సలరాణి
Comments
Please login to add a commentAdd a comment