మూసీని పరిశీలించిన కలెక్టర్, డీసీపీ
వలిగొండ, రామన్నపేట : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 8న యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా మూసీ పునరుజ్జీవన పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యలో కలెక్టర్ హనుమంతరావు నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి సోమవారం వలిగొండ మండలం సంగెం సమీపంలో మూసీ నదిని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చెట్లు తొలగించి చదును చేసి దారి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా డీసీపీ రాజేష్‌చంద్ర రామన్నపేట మండలంలోని నాగారం శివారునుంచి ఇంద్రపాలనగరం పెద్ద చెరువు వరకు ఆసిఫ్‌నహర్ కాల్వ ప్రాంతాలను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
పోలీస్ స్టేషన్ తనిఖీ
వలిగొండ పోలీస్ స్టేషన్‌ను డీసీపీ రాజేష్‌చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు, పురోగతిని తెలుసుకున్నారు. ఆయన వెంట చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు మల్లయ్య, యుగేందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment