సాక్షి, యాదాద్రి: రైతు భరోసా సాయంపై స్పష్టత కరువైంది. వానాకాలం సీజన్ ముగుస్తున్నా నేటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు. దీంతో రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆనంద పడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతు బంధు పేరుతో సీజన్ ఆరంభంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమచేసేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నేటికీ రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. ఫలితంగా పెట్టుబడి సాయం కోసం జిల్లాలో 2,71,979 మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
ప్రతి సీజన్‌కు ఇలా..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరాకు రెండు సీజన్లకు కలిపి రూ.10 వేల చొప్పున రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేది. ప్రతి సీజన్‌కు 2,71,979 మంది రైతులకు రూ.304.85 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ చేసేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ సీజన్ ముగుస్తున్నప్పటికీ నేటికి రైతు భరోసా నిధులను జమ చేయకపోవడంతో రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తారా..? లేక రూ.15 వేల చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఇస్తారా? అనే దానిపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించలేదు. దీంతో రైతు భరోసా నిధులపై సందిగ్ధత నెలకొంది.
కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకర్లు
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణాలు కలిగిన రైతులకు మూడు విడతల్లో మాఫీ చేసింది. ఇందులో వేలాది మంది రైతులకు వివిధ సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదు. రుణమాఫీ పొందిన రైతులకు సైతం అనేక బ్యాంకుల్లో పంట రుణాలను తిరిగి ఇవ్వడం లేదు. రుణమాఫీ దక్కని రైతులకు కూడా బ్యాంకర్లు కొత్తగా పంట రుణాలను ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. దీని కారణంగా వానాకాలం సీజన్‌లో రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతు భరోసా విధివిధానాలు ఖరారుచేసి పెట్టుబడి సాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఫ వానాకాలం సీజన్ ముగుస్తున్నా
స్పష్టత కరువు
ఫ పెట్టుబడి సాయం అందక ఇబ్బందులు
ఫ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న
రైతులు
ఫ 2.71 లక్షల మంది ఎదురుచూపు
Comments
Please login to add a commentAdd a comment