మహిళా శక్తి కాం్యటీన్లు | - | Sakshi
Sakshi News home page

మహిళా శక్తి కాం్యటీన్లు

Published Thu, Nov 21 2024 1:23 AM | Last Updated on Thu, Nov 21 2024 1:23 AM

మహిళా

మహిళా శక్తి కాం్యటీన్లు

జిల్లాలో ఐదు చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు

ప్రభుత్వ విప్‌ అయిలయ్య

చేతుల మీదుగా ప్రారంభం

కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను గురువారం ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్‌, కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

సాక్షి యాదాద్రి : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు ఐదు క్యాంటీన్లు మంజూరు చేయగా.. వాటిని విడతల వారీగా ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి, మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత కలెక్టరేట్‌లోని క్యాంటీన్‌ను గురువారం ప్రారంభించనున్నారు.

మహిళా సాధికారతే లక్ష్యంగా..

మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను లక్షాధికారులను చేస్తామని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం వారిని ఆర్థికంగా ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం కుట్టించే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించారు. తాజాగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

ఈ ప్రాంతాల్లో

క్యాంటీన్ల ఏర్పాటు

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను జనరద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కలెక్టరేట్‌లు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ఆలయాలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు.. తదితర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఐదు క్యాంటీన్లను కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. తొలుత కలెక్టరేట్‌లో ప్రారంభించనున్నారు. అనంతరం ఆలేరు, యాదగిరిగుట్టలో ప్రారంభించనున్నారు. ఇందుకు అనువైన స్థలాలను కూడా గుర్తించారు. ఆతరువాత చౌటుప్పల్‌, మరోచోట మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో క్యాంటీన్‌లో 20 మంది సభ్యులు

ఒక్కో మహిళా శక్తి క్యాంటీన్‌లో ఐదు నుంచి 20 మంది వరకు సభ్యులు ఉంటారు. నిర్వహణ సామర్థ్యం కలిగిన సంఘాలను ఎంపిక చేసి సభ్యులకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 20 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.

ఆర్డర్లపైనా సరఫరా

మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా కల్తీలేని, రుచికరమైన వంటకాలు అందించనున్నారు. స్నాక్స్‌, కరివేపాకు, వెల్లుల్లి కారం పొడులు, స్వీట్లు, పచ్చళ్లు, టిఫిన్స్‌, భోజనం, పండ్ల రసాలు, బిర్యానీ, బేకరీ పుడ్స్‌ అందజేస్తారు. క్యాంటీన్‌కు వచ్చేవారికే కాకుండా సమా వేశాలు, శుభకార్యాలకు ఆర్డర్లపైనా అందజేస్తారు.

ఫ తొలుత కలెక్టరేట్‌లో నేడు ప్రారంభం

ఫ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ

ఫ సభ్యులకు శిక్షణ పూర్తి

ఫ అందుబాటులో నాణ్యమైన, రుచికరమైన వంటకాలు

కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దాం

జిల్లాలో ఐదు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. మొదటి క్యాంటీన్‌ను నేడు కలెక్టరేట్‌లో ప్రారంభిస్తున్నాం. ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరిలో కూడా స్థలాలు గుర్తించాం. క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన రుణాలను మహిళా సంఘబంధాల ద్వారా సభ్యులకు ఇపిస్తున్నాం. ఎంపిక చేసిన సంఘాల సభ్యులకు వంటకాల తయారీపై ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. నాణ్యత, రుచికరమైన వంటకాలు అందించడమే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల లక్ష్యం. క్యాంటీన్లను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దాం.

–నాగిరెడ్డి, డీఆర్‌డీఓ

No comments yet. Be the first to comment!
Add a comment
మహిళా శక్తి కాం్యటీన్లు1
1/1

మహిళా శక్తి కాం్యటీన్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement