పీఆర్సీ అమలుకు కార్యాచరణ
భువనగిరి : ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ బిల్లులు, డీఏ, పీఆర్సీ అమలుకోసం కార్యాచరణ ప్రకటిస్తామని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం భువనగిరిలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న సీపీఎస్ విధానం రద్దు కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కాపాడటం కోసం తాను ఎమ్మెల్సీగా బరిలోకి దిగానని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూటీఎస్ ముందంజలో ఉంటుందన్నారు. అనంతరం ఆయను ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూన్, గౌరవ అధ్యక్షుడు వీరారెడ్డి, నాయకులు ఉపేందర్‌రావు, కోమటిరెడ్డి నర్సింహ్మరెడ్డి, వెంకటయ్య, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment