పాఠాలు చెప్పి.. ప్రశ్నలు అడిగి
భువనగిరి : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హనుమంతరావు బుధవరాం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న తీరుపై ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం పదో తరగతికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. గణితంలో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించారు. అలాగే వారికి గణిత పాఠం బోధించారు. ఒత్తిడి లోనవకుండా అభ్యసన చేయాలని, డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
భువనగిరి రూరల్ : భువనగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ హనుమంతరావు బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డితో మాట్లాడారు. భూసమస్యలపై వచ్చిన దరఖాస్తులు, పరిష్కారంపై ఆరా తీశారు.
ఫ భువనగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
ఫ గణిత పాఠ్యాంశం బోధన
వసతి గృహాల్లో బస చేస్తా
సాక్షి,యాదాద్రి : వసతి గృహాల్లో ఈ వారం నుంచి రాత్రి బస చేస్తానని, విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం సంక్షేమ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రకాల హాస్టళ్లు, పాఠశాలలను తనిఖీ చేస్తానన్నారు. వసతిగృహాల సంక్షేమ అధికారులు బాధ్యతల నుంచి తప్పించుకోవద్దని, విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుపడాలని సూచించారు. హాస్టళ్లను సొంత ఇంటిలా చూసుకోవాలని, పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజ నం అందజేయాలని పేర్కొన్నారు. 10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటి కప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేకాధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment