గాంధీ కలలను సాకారం చేయడమే ధ్యేయం
యాదగిరిగుట్ట : గాంధీ కలలను సాకారం చేయడమే తమ సంస్థ లక్ష్యమని గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్టలోని రెడ్డి భవన్‌లో బుధవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి శ్రీగాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు –2024శ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ చెప్పిన అంశాలను ఐక్యరాజ్యసమితి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా గుర్తించి, ప్రపంచ ప్రగతి కోసం 2030 నాటికి సాధించాలని ప్రకటించిందన్నారు. వీటిలో సుస్థిర విద్య, ప్రకృతి వైద్యం, క్రీడలు, ఇందన వనరులు, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, పర్యావరణం, మహిళా సాధికారకత, నీటి సంరక్షణ తదితర అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ స్టాల్స్ ద్వారా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22న యాదగిరిగుట్టలో గాంధీ ఫొటో గ్యాలరీ, యోగా, చరక, గ్రామ నిర్మాణం, పురాతన, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, ప్రకృతి వ్యవసాయ పంటలు, ఎద్దు గానుగ, మల్కం గేమ్, యోగా ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. రైతులతో పాటు వ్యవసాయ రంగ అభివృదికి కృషి చేస్తున్న 115మంది రైతులకు పుడమిపుత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలు అందజేస్తున్న అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, జర్నలిస్టులకు కిసాన్ సేవారత్న అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా పడమటి పావని వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గానాల ప్రభాకర్‌రెడ్డి, బుర్ర దశరథగౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, వ్యవసాయ రంగ కన్వీనర్ పడమటి పావని, వైస్ ప్రెసిడెంట్ గాంధారి ప్రభాకర్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, ప్రతినిధులు పాలకూర వెంకటేశ్వర్లు, డాక్టర్ మిరియాల దుర్గాప్రసాద్, వెంకన్న, బాలరాజు, చిరంజీవినాయక్, సతీష్, పవన్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ గున్న రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment