కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
యాదగిరిగుట్ట రూరల్ : కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని కలెక్టర్ హనుమంతరావు రైతులకు సూచించారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురంలోని కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment