ఉదయం 9గంటల నుంచే ఓపీ సేవలు | - | Sakshi
Sakshi News home page

ఉదయం 9గంటల నుంచే ఓపీ సేవలు

Published Thu, Nov 21 2024 1:23 AM | Last Updated on Thu, Nov 21 2024 1:23 AM

-

భువనగిరి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచే ఓపీ సేవలు ప్రారంభించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 8.55కు పీహెచ్‌సీల వైద్యాధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని, సకాలంలో హాజరు కావాలని సూచించారు. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయని, అంకితభావంతో పనిచేసిన వారిని ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, లేకపోతే వెంటనే ఇండెంట్‌ పెట్టి తెప్పించాలని సూచించారు.

ఫ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement