విధులు సమర్థంగా నిర్వహించాలి
నల్లగొండ క్రైం: కొత్తగా విధుల్లో చేరబోయే పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు వన్నె తేవాలని రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సుధీర్‌బాబు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తొమ్మిది నెలలుగా శిక్షణ పొందిన కానిస్టేబుళ్లకు గురువారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. శిక్షణార్థుల నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు శరత్‌చంద్ర పవార్, సన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగమంటేనే అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అన్ని అంశాలు విధి నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేరాల నియంత్రణలో నిత్య విద్యార్థిగా మారాలన్నారు. సైబర్ నేరాలు, ఇతర నేర సంఘటనలను వెలికి తీయడంలో సాంకేతిక నైపుణ్యాలు వినియోగంచుకోవాలన్నారు. నూతనోత్సాహంతో ప్రజలకు ప్రాణవాయువులా సేవలందించాలన్నారు. విధుల్లో ఒత్తిడికి గురికాకుండా శారీరక, మానసింగా ధృడత్వం కోసం రోజూ వ్యాయామం, యోగా సాధన చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉన్నతాధికారుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధపడేది పోలీసులే అన్నారు. శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభకనబర్చిన బెస్ట్ ఆల్‌రౌండర్ జె.అనిల్, బెస్ట్ ఇండోర్ ఆర్.మహేష్, బెస్ట్ అవుట్‌డోర్ ముజీబుద్దీన్, బెస్ట్ పైర్ టి.ప్రశాంత్, పరేడ్ కమాండర్ నరేష్‌లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఏఎస్పీ రమేష్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాములునాయక్, డీఎస్పీ విఠల్‌రెడ్డి, శివరాంరెడ్డి, శ్రీనివాస్, సీఐలు దానియెల్, రాజశేఖర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.
కుటుంబసభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం
నల్లగొండ డీటీసీలో సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకు చెందిన పోలీస్ అభ్యర్థులు తొమ్మిది నెలలుగా శిక్షణ పొందారు. కాగా నల్లగొండ జిల్లాకు చెందిన పోలీసులు మేడ్చల్‌లో శిక్షణ పొందారు. తమ పిల్లలు పోలీస్ ఉద్యోగ శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరునుండడంతో ఆయా జిల్లాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మొత్తంగా పోలీస్ ఉద్యోగం సాధించిన తమ కుమారులు, కుమార్తెలను చూసిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు బావోద్యేగానికి గురయ్యారు. ఆత్మీయంగా అలింగనం చేసుకోవడంతో పాటు ఉద్యోగం పొందిన వారు వారి తల్లిదండ్రులకు పాదాభివందనం కృతజ్ఞతలు తెలిపారు. కొందరు కానిస్టేబుల్స్ తమ తల్లిదండ్రుల నెత్తిపై పోలీస్ టోపీలు పెట్టి, చేతికి గన్నులు ఇచ్చి మురిసిపోయారు.
ఫ పోలీస్ ఉద్యోగం అంటేనే
అనేక సవాళ్లను అధిగమించాలి
ఫ రాచకొండ సీపీ సుధీర్‌బాబు
ఫ వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment