దివ్యాంగులమని అధైర్యపడవద్దు
భువనగిరిటౌన్ : దివ్యాంగులు ఎవరికంటే తక్కువ కాదని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ గంగాధర్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహ, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజయ్, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది, పీఈటీలు పాల్గొన్నారు.
మొక్కుబడిగా క్రీడా పోటీలు
దివ్వాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించేవారు. కనీసం 200 మంది దివ్వాంగులు క్రీడా పోటీల్లో పాల్గొనేవారు. కానీ,ఈసారి మొక్కుబడిగా నిర్వహించారు. 40నుంచి 60 మంది మాత్రమే పోటీలకు హాజరయ్యారు. అధికారులు పట్టించుకోకపోవడం, ప్రచారం చేయకపోవడం వల్లే పోటీలు సాదాసీదాగా జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment