ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం
భువనగిరి : జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వైద్యవిద్య సాకారమైంది. జిల్లాకు మంజూరైన యాదాద్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యాయి. గత నెల 26వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించగా.. తాజాగా ఆప్‌లైన్‌లో తరగతులు ప్రారంభించారు. విద్యార్థులంతా తరగతులకు హాజరవుతుండడంతో కళాశాల కళకళలాడుతోంది. దీంతో కళాశాల విద్యార్థులతో కళాకళాడుతోంది.
ప్రథమ సంవత్సరం 50 సీట్లతో..
మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైంది. భువనగిరి పట్టణ శివారులోని పాత కలెక్టరేట్ భవన సముదాయంలో తరగతులు కొనసాగుతున్నాయి. ముందు భాగంలో ఉన్న భవనంలో తరగతులు నిర్వహిస్తుండగా, పై అంతస్తులో బాలుర హాస్టల్ ఏర్పాటు చేవారు. వెనుక వైపు ఉన్న భవనంలో బాలికల హాస్టల్ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ల కోసం ప్రత్యేకంగా భవనాలు కేటాయించారు.
వసతులు ఎలా ఉన్నాయి
ఫ విద్యార్థులను అడిగి తెలుసుకున్న కలెక్టర్
ఫ బీబీనగర్ ఎస్సీ బాలుర హాస్టల్ తనిఖీ
బీబీనగర్: మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శనివారం రాత్రి కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు. మోనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, వసతులు ఎలా వున్నాయి, అల్పాహారంగా ఏం అందజేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నోట్‌బుక్స్‌ను పరి శీలించారు. ప్రశ్నలు వేసి సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని వార్డెన్‌కు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందజేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీధర్, ఆర్‌ఐ వెంకటరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment