రైతు సంఘాన్ని సందర్శించిన జర్మని సభ్యులు
మోత్కూరు: మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలోని శ్రీ మత్స్యగిరి రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని మంగళవారం జర్మని కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడి వ్యవసాయ పద్ధతులు రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థ ద్వారా వ్యవసాయ పనిముట్లతో పాటు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం రైతు సంఘం అధ్యక్షులు వల్లపు సైదులు వారిని సన్మానించారు. కార్యక్రమంలో జర్మనీ బృందం సభ్యులు డాక్టర్ గ్లాజర్, థామస్, ప్రీస్, ఈవా, అణికా, జూలియన్, రాజు, మాజీ సర్పంచ్‌లు మర్రిపల్లి యాదయ్య, అంతటి నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment